"పౌర హక్కుల దినోత్సవం నెలవారీగా నిర్వహించాలి"
BHPL: టేకుమట్ల MRO కార్యాలయంలో MRO విజయలక్ష్మికి శనివారం అంబేద్కర్ యువజన సంఘం ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి మాట్లాడుతూ మాట్లాడుతూ..ప్రతి నెల 30న గ్రామ స్థాయిలో పౌర హక్కుల దినోత్సవాన్ని విధిగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. అంటరానితనం, కుల వివక్ష నిర్మూలనకు పౌర హక్కుల దినోత్సవాలు దోహదపడతాయని తెలిపారు.