మార్కెట్ మోసాలు.. ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యం..!

HYD: షేర్ మార్కెట్‌లో మంచి పెట్టుబడులు పెట్టండి, మేము అత్యధిక లాభాలు అందించడానికి వీలుంటుందని చెప్పి మోసం చేసిన ఘటనలు అనేకం. మణికొండ లాంకో హిల్స్, ఉప్పల్ గణేష్ నగర్ కాలనీలో ఏకంగా ఇంజనీర్లనే బోల్తా కొట్టించి రూ.6 లక్షల వరకు కొల్లగొట్టారు. షేర్ మార్కెట్ మాయమాటలతో మోసపోయిన అనేకమంది మానసిక ఒత్తిడికి తట్టుకోలేక, అనారోగ్యాల పాలవుతున్నట్లు నివేదికలు తెలిపాయి.