సాగునీటితో అధిక దిగుబడులు పొందాలి: MLA
ADB: సాత్నాల కెనాల్ నుంచి విడుదలయ్యే సాగునీరును పంట పొలాలకు ఉపయోగించుకొని అధిగ దిగుబడులు పొందాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ సూచించారు. ప్రాజెక్టుకు మరమ్మత్తులు పూర్తి కావటంతో శుక్రవారం స్థానికులతో కలిసి కెనాల్ ద్వారా నీటిని విడుదల చేశారు. నియోజకవర్గ రైతాంగానికి మేలు చేకూర్చేందుకు తనవంతుగా కృషి చేస్తానని పేర్కొన్నారు.