పోలింగ్ కేంద్రాలను సందర్శించిన కలెక్టర్
NZB: గ్రామ పంచాయతీ ఎన్నికలను పురస్కరించుకుని నవీపేట్ మండలం అభంగపట్నం, ఎడపల్లి మండలం జానకంపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి శనివారం సందర్శించారు. పోలింగ్ స్టేషన్ల పరిధిలో ఓటర్ల సంఖ్య, సర్పంచి, వార్డు స్థానాలకు పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలు అడిగి తెలుసుకున్నారు.