'ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారు'
AP: విశాఖలో జరిగిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో బీజేపీ కీలక నేత సోము వీర్రాజు పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్పష్టమైన సిద్దాంతాలతో దేశాన్ని నడిపిస్తున్న BJP.. సంఘటన, సంరక్షణ, సందర్శన విధానాలపై దృష్టి పెట్టిందన్నారు. ఇతర పార్టీల నేతలు బీజేపీ వైపు చూస్తున్నారని తెలిపారు. స్వయం సమృద్ధి దిశగా దేశం పురోగతి చెందుతోందని పేర్కొన్నారు.