మీకు తెలుసా?.. నేడు రాజ్యాంగ దినోత్సవం
రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇవాళ పాత పార్లమెంట్‌లోని సెంట్రల్ హాల్‌లో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అధ్యక్షతన కార్యక్రమం నిర్వహించనున్నారు. ప్రధాని మోదీ, ఉపరాష్ట్రపతి తదితరులు హాజరుకానున్నారు. రాజ్యాంగాన్ని 1949 నవంబర్ 26న రాజ్యాంగ సభ ఆమోదించింది. 2015 నుంచి ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినం, సంవిధాన్ దివస్‌ను జరుపుకుంటున్నారు.