అలంపూర్‌లో వీధి కుక్కల బెడద

అలంపూర్‌లో వీధి కుక్కల బెడద

GDL: అలంపూర్ పట్టణంలో వీధి కుక్కల బెడద రోజురోజుకూ పెరుగుతున్నప్పటికీ, మున్సిపల్ అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాహనాలపై వెళ్లేటప్పుడు కుక్కలు వెంటపడటం, గతంలో పలువురు కుక్క కాటుకు గురికావడం వంటి సంఘటనలు జరిగాయని చెబుతున్నారు. అధికారులు స్పందించి వీధి కుక్కలను పట్టణం నుంచి తరలించాలని స్థానికులు కోరుతున్నారు.