సిరాజ్‌పై నమ్మకం ఉంచలేం: కైఫ్
గుజరాత్ టైటాన్స్ బౌలింగ్‌పై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆ జట్టుకు డెత్ బౌలింగ్ ప్రధాన బలహీనతని పేర్కొన్నాడు. సిరాజ్ కొత్త బంతితో రాణించినా, చివరి ఓవర్లలో ధారాళంగా పరుగులిస్తాడని చెప్పాడు. అందుకే సిరాజ్‌పై నమ్మకం ఉంచలేమన్నాడు. స్లాగ్ ఓవర్లలో బౌలింగ్‌ను మెరుగుపరుచుకోకపోతే గుజరాత్‌కు కష్టాలు తప్పవని హెచ్చరించాడు.