'సుపరిపాలన యాత్రను విజయవంతం చేయండి'

'సుపరిపాలన యాత్రను విజయవంతం చేయండి'

SKLM: మాజీ పీఎం అటల్ బిహారీ వాజ్‌పేయి శత జయంతి ఉత్సవాలలో భాగంగా ఈ నెల 19న జిల్లాలో జరగబోయే “అటల్–మోదీ సుపరిపాలన యాత్ర” విజయవంతం చేయాలని జిల్లా బీజేపీ అధ్యక్షులు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు. ప్రతి కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.