రేపటి పోలింగ్‌కు సమాయత్తమవుతున్న అధికారులు

రేపటి పోలింగ్‌కు సమాయత్తమవుతున్న అధికారులు

RR: గ్రామపంచాయతీ ఎన్నికలకు అంత సిద్ధమైంది. రేపటి పోలింగ్‌కు అధికారులు సమాయత్తమవుతున్నారు. కొత్తూరు, నందిగామ, ఫరూఖ్ నగర్, కొందుర్గు, చౌదరిగూడ, కేశంపేట మండలాల పరిధిలో ఎన్నికల సిబ్బంది మెటీరియల్ పంపిణీ కార్యక్రమంలో అధికారులు నిమగ్నమయ్యారు. ఆయా మండలాల్లోని గ్రామాలకు కేటాయించిన పోలింగ్ సిబ్బందికి ఎన్నికల సామాగ్రిని అధికారులు అందజేశారు.