VIDEO: పంట పొలాలను పరిశీలించిన కలెక్టర్
GNTR: కొల్లిపర మండలం దావులూరు గ్రామంలో జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారీయా పంట పొలాలను ఇవాళ పరిశీలించారు. ఈ మేరకు రైతులతో మాట్లాడి ధాన్యం విక్రయాల్లో ఎదురవుతున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోలు, విక్రయ ప్రక్రియలో ప్రభుత్వం సూచించిన నిబంధనలు అమలవుతున్న విధానాన్ని పరిశీలించారు.