లబ్ధిదారునికి ఎల్‌వోసీ అందజేత
JGL: ఆపదలో ఉన్న పేదలకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలోని 42వ వార్డుకు చెందిన కాలేరు వెంకటేశంకు మంజూరైన రూ.2.50 లక్షల విలువైన ఎల్‌వోసీ పత్రాన్ని మంగళవారం ఆయన కార్యాలయంలో ఎమ్మెల్యే అందజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు.