'బ్యాంకు సేవలకు అవగాహన కలిగి ఉండాలి'
మంచిర్యాల: బ్యాంకు సేవలపై అవగాహన కలిగి ఉండాలని దండేపల్లి ఆర్థిక అక్షరాస్యత కేంద్రం సీఎఫ్ఎల్ కౌన్సిలర్ వేల్పుల రవీందర్ అన్నారు. శనివారం జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో ఆర్థిక అక్షరాస్యత కేంద్రం డ్వాక్రా మహిళలకు బ్యాంకు సేవలపై అవగాహన కల్పించారు. బ్యాంకుల ద్వారా ప్రజలకు సేవింగ్స్, ఇన్సూరెన్స్, వాహనాలు, వ్యవసాయం రుణాలు అందించడం జరుగుతుందని ఆయన వివరించారు.