రోడ్డు ప్రమాద బాధితుడి కుటుంబానికి ఎన్ఆర్ఐ ఆర్థిక సహాయం

HNK: ధర్మసాగర్ మండలం ముప్పారం గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన మాచర్ల రాజు కుటుంబానికి ఎన్నారై పల్లపురెడ్డి రాంరెడ్డి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం మృతుడి కుటుంబ సభ్యులకు రూ.10వేల ఆర్థిక సహాయాన్ని అందించారు.