కార్మికుడికి అండగా ప్రభుత్వ విప్

కార్మికుడికి అండగా ప్రభుత్వ విప్

భువనగిరి: యాదగిరిగుట్టకు చెందిన కొండపైకి ఆటో నడిపే కార్మికుడు బొల్లం ఎల్లస్వామి అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో తోటి ఆటో కార్మికులు ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య దృష్టికి సమస్యను తీసుకెళ్లగా గురువారం రోజు ఎల్లస్వామికి ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో గుండు నరసింహ, నవీన్, రాజు తదితరులు పాల్గొన్నారు.