'మన ఆలోచన సాధన సమితి అడ్-హాక్' మండల కమిటీ ఎన్నిక
SDPT: 'మన ఆలోచన సాధన సమితి చిన్నకోడూరు మండల అడ్-హాక్' కమిటీని సోమవారం ఎన్నుకున్నారు. కన్వీనర్‌గా బత్తిని గణేష్ గౌడ్, కో-కన్వీనర్‌గా తాడూరు ముత్తేష్, సభ్యులుగా చెరుకు నారాయణ, మిట్టపల్లి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్, సాయిరాం, లక్ష్మణ్ తదితరులు ఎన్నికయ్యారు. ఎన్నికైన వారికి సమితి ప్రతినిధులు నియామక పత్రాలను అందజేశారు.