గుండ్రాతి మడుగులో మాజీ మంత్రి ప్రచారం
MHBD: కురవి మండల కేంద్రంలోని గుండ్రాతిమడుగు గ్రామంలో నిర్వహించిన గ్రామపంచాయతి ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ బుధవారం పాల్గొన్నారు. మొదటగా గ్రామంలోని శ్రీ సీతారామ ఆలయంలో స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం BRS పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను గెలిపించాలని గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ప్రజలను కోరారు.