మోదీ వ్యాఖ్యలు బాధాకరం

E.G: పోలవరం ప్రాజెక్టును తమ ప్రభుత్వం నిర్మించడం లేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ స్పందించారు. 'మోదీ వ్యాఖ్యలు బాధాకరం. పోలవరానికి కేంద్రం ఇచ్చిన నిధుల కంటే అదనంగా తమ ప్రభుత్వం ఖర్చు చేసింది. సరైన సమయంలో నిధులు ఇస్తే పోలవరం పూర్తి చేసేవాళ్లం. పదేళ్లలో ఏపీకి కేంద్రం ఏం చేసిందో బీజేపీ వాళ్లు చెప్పాలి' అని డిమాండ్ చేశారు.