'మౌలానా అబుల్ కలాం సేవలు మరువలేనివి'

'మౌలానా అబుల్ కలాం సేవలు మరువలేనివి'

KNR: మొదటి విద్యాశాఖ మంత్రి, స్వాతంత్య్ర సమరయోధుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ దేశానికి అందించిన సేవలు మరువలేనివని కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. మంగళవారం ఆయన జయంతి కార్యక్రమాన్ని కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, కలెక్టర్ మాట్లాడారు.