నేడు విద్యుత్ సరఫరా నిలిపివేత
VSP: పెందుర్తిలో నాగ మల్లినగర్ 11కేవీ ఫీడర్‌లో మరమ్మతుల కారణంగా ఇవాళ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఉంటుందని ఈఈ బి.సింహాచలం నాయుడు తెలిపారు. కార్మికనగర్, గిరిప్రసాద్నగర్, డీఏవీ పాఠశాల ప్రాంతం, వెంకటాద్రినగర్, సీ-1, సీ-2 జోన్‌లు, డాక్యార్డు లేఅవుట్, విరాట్నగర్, టీచర్స్ లేఅవుట్ ప్రాంతాలకు సరఫరా ఉండదన్నారు.