ఓట్ల కోసం బీసీలను వాడుకుంటున్నారు: ఆర్.కృష్ణయ్య
TG: రిజర్వేషన్లపై హైకోర్టులో కేసు నడుస్తుండటంతో తీర్పు వచ్చే వరకు ఎన్నికలను వాయిదా వేయాలని బీసీ సంఘాల జేఏసీ ఛైర్మన్ ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. ఓటు బ్యాంకు కోసం బీసీలను వాడుకుంటున్నారని మండిపడ్డారు. బీసీ నేతలను అన్ని పార్టీలు చిన్నచూపు చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ప్రధాని మోదీ దగ్గరకు అఖిలపక్షాన్ని తీసుకెళ్లలేదని.. బీసీలకు మోదీ మేలు చేస్తారని ఆకాంక్షించారు.