యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై శిక్షణ

యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వేపై శిక్షణ

VZM: బొబ్బిలి పురపాలక సంఘ పరిధిలో యూనిఫైడ్ ఫ్యామిలీ సర్వే నిర్వహణకు మున్సిపల్ ఆఫీస్ కౌన్సిల్ హాల్‌లో మంగళవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా టీపీఆర్‌‌వో ఎం.జగన్మోహనరావు మాట్లాడుతూ.. అర్హులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకు, ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు జారీకి ఈ సర్వే ఉపయోగపడుతుందని తెలిపారు. జనవరి 12లోగా సర్వే పూర్తి చేయాలన్నారు.