అంగళ్ళు ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద కనిగిరి బస్సు బోల్తా

అన్నమయ్య: అంగళ్లు ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్ద కనిగిరి బస్సు బోల్తా పడి పలువురు ప్రయాణికులు గాయపడ్డట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. కనిగిరి నుంచి బెంగళూరుకు వెళుతున్న బస్సు, తంబళ్లపల్లి నియోజకవర్గంలోని కురబలకోట మండలం అంగళ్లు ఫ్లైఓవర్ బ్రిడ్జి దాటగానే ముందు వెళుతున్న కారును తప్పించబోయి అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో పలువురు ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు.