వేలాడుతున్న విద్యుత్ తీగలు.. ప్రజల ఆందోళన
SRPT: సూర్యాపేట జిల్లా కేంద్రంలోని తాళ్లగడ్డ ప్రియాంక కాలనీ రోడ్డుపై సర్వీస్ వైరు తెగి ప్రమాదకరంగా కిందకు వేలాడుతోంది. రోడ్డు మధ్యలో ఉన్న ఈ తీగలతో ఎప్పుడు ఏం జరుగుతుందోనని వాహనదారులు, స్థానికులు వణికిపోతున్నారు. విద్యుత్ అధికారులు తక్షణమే స్పందించి ప్రమాదకరంగా ఉన్న వైరును తొలగించి, పెను ప్రమాదం జరగకుండా చూడాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.