VIDEO: ఆ గ్రామాలకు రాకపోకలు బంద్
SRPT: మోతే మండలంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వాగులు, చెరువులు ఉప్పొంగి అలుగుపారుతున్నాయి. దీంతో విభళాపురం నుంచి మామిళ్లగూడెం వెళ్లే రహదారిపై ఉన్న వంతెన పైనుంచి వరద నీరు ప్రమాదకరంగా ప్రవహిస్తోంది. అధికారులు అప్రమత్తమై ఈ రహదారిపై రాకపోకలను నిషేధించారు. నిత్యం పది గ్రామాల ప్రజలు వెళ్లే ఈ మార్గానికి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు.