'మోగ్లీ' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

'మోగ్లీ' ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంతంటే?

టాలీవుడ్ నటుడు రాజీవ్ కనకాల, సుమ తనయుడు రోషన్ హీరోగా నటించిన 'మోగ్లీ' మూవీ థియేటర్లలో సందడి చేస్తోంది. తాజాగా ఈ సినిమా మొదటి రోజు కలెక్షన్స్‌ను మేకర్స్ ప్రకటించారు. ప్రీమియర్స్‌తో కలిపి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రూ.1.22 కోట్లకుపైగా వసూళ్లు సాధించినట్లు వెల్లడించారు. ఈ మేరకు 'వైల్డ్ బ్లాక్‌బస్టర్' అంటూ పోస్టర్ షేర్ చేశారు.