పండ్ల తోటల పెంపకానికి భూమి పూజ

పండ్ల తోటల పెంపకానికి భూమి పూజ

SRD: ప్రభుత్వం రూపొందించిన పనుల జాతర ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని న్యాల్కల్ ఎంపీడీవో శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం న్యాల్కల్ శివారులో రెండు ఎకరాల్లో పండ్ల తోటల పెంపకంలో భాగంగా మామిడి పంట సాగు పనులను ఎంపీడీవో ప్రారంభించారు. అనంతరం ఆయా గ్రామాల్లో ఈ కార్యక్రమం పై అవగాహన కల్పించారు. ఇందులో ఏపీఓ పాండురంగారావు ఉన్నారు.