చిట్యాలలో పంటలను పరిశీలించిన.. శాస్త్రవేత్తల బృందం

BHPL: చిట్యాల మండల కేంద్రంలోని పలు గ్రామాల్లో గురువారం తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తల బృందం పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ.. పత్తిలో తెగులు నివారణకు లీటరు నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సి క్లోరైడ్ కలిపి పిచికారి చేయాలని సూచించారు. కాయ కుళ్లు, రసం పీల్చే పురుగుల నివారణకు కూడా సలహాలు అందించారు.