నిజం సాగర్ ప్రాజెక్ట్‌లోని నీటిని విడుదల చేసిన అధికారులు

కామారెడ్డి జిల్లా SV4 న్యూస్ ప్రతినిధి సూర్య నిజంసాగర్ మండల కేంద్రంలోని నిజాంసాగర్ ప్రాజెక్టు నీటిని నీటిపారుదల శాఖ అధికారులు విడుదల చేశారు. ప్రాజెక్టు ప్రధాన కాలువ ద్వారా 600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ప్రాజెక్టు ఏఈఈ. సాకేత్ తెలిపారు. ప్రాజెక్టుల్లో 17.802 టీఎంసీలకు గాను ప్రస్తుతం 4.627 టీఎంసీల నీరు ఉందన్నారు.