VIDEO: తీజ్ పండగను విజయవంతం చేయాలి: మాజీ ఎంపీ

WGL: గ్రేటర్ వరంగల్‌లో ఈ నెల 12 నుంచి 21 వరకు జరిగే తీజ్ పండగ ఉత్సవాలను విజయవంతం చేయాలని మాజీ ఎంపీ సీతారాం నాయక్ కోరారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్రేటర్ వరంగల్ గోర్ బంజారా ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ వేడుకలకు పెద్ద ఎత్తున బంజారాలంతా తరలిరావాలని ఆయన పిలుపునిచ్చారు.