దట్టంగా కమ్మేసిన పొగమంచు దుప్పట్లు
KMR: జిల్లాలో గురువారం పొగమంచు దట్టంగా కమ్మేసింది. పాత రాజంపేట, చిన్నమల్లారెడ్డి పరిసరాల్లో ఇల్లు కనబడనంతగా పొగమంచు ఆవరించింది. పాత జాతీయ రహదారి వెంబడి పొగమంచు దుప్పట్లు పరుచుకోగా ఎదురుగా వచ్చే వాహనాలు కనబడక వాహనదారులు ఇక్కట్లు పడ్డారు. వరి ధాన్యాన్ని ఆరబోసుకున్న రైతులు పొగమంచు కారణంగా అవస్థలు పడుతున్నారు.