VIDEO: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

VIDEO: కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య

JN: పాలకుర్తి మండలం లోని ముత్తారం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. సోమవారం కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన వేముల అర్చన (28) అనే వివాహిత బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నట్లు సమాచారం. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.