వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి

వినతి పత్రాలు స్వీకరించిన మంత్రి

ప్రకాశం: టంగుటూరు మండలం తూర్పునాయుడుపాలెంలో కొండేపి ఎమ్మెల్యే, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోల బాల వీరాంజనేయ స్వామి బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. తాను నియోజక వర్గ ప్రజలతో పాటు జిల్లా ప్రజలకు అందుబాటులో ఉంటానని అన్నారు. ప్రజల ఇచ్చిన వినతి పత్రాలను ఓపిగ్గా చదివి సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార దిశగా ప్రయత్నించారు.