మార్కెట్‌లో తగ్గిన పత్తి ధర
KNR: జమ్మికుంట మార్కెట్‌లో పత్తి ధర నిన్నటి కంటే ఈరోజు స్వల్పంగా తగ్గింది. మంగళవారం క్వింటా పత్తి ధర రూ. 7,450 పలకగా బుధవారం రూ.50 తగ్గి రూ.7,400 పలికినట్లు మార్కెట్ అధికారులు తెలిపారు. బుధవారం మార్కెట్‌కు రైతులు 62 వాహనాల్లో 446 క్వింటాళ్ల విడి పత్తిని తీసుకువచ్చినట్లు చెప్పారు. మార్కెట్లో కొనుగోళ్లను ఉన్నత శ్రేణి కార్యదర్శి రాజా పరిశీలించారు.