ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ఆనందబాబు

ప్రజల నుండి అర్జీలు స్వీకరించిన ఎమ్మెల్యే ఆనందబాబు

BPT: వేమూరు మండలంలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన ప్రజాధర్బార్ కార్యక్రమంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు పాల్గొని ప్రజల నుండి అందిన అర్జీలను స్వీకరించారు. ప్రజల సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులతో టెలిఫోన్ ద్వారా మాట్లాడి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సంబంధిత ప్రభుత్వ అధికారులు పాల్గొన్నారు.