ఎమ్మెల్యే సమక్షంలో టీడీపీలో చేరిక
నెల్లూరు రూరల్ సౌత్ మోపూరు గ్రామానికి చెందిన 50కుటుంబాలు టీడీపీలో చేరాయి. వారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. టీడీపీ బలోపేతానికి అందరూ కృషి చేయాలన్నారు. ఈ మేరకు తాను అందరికీ అండగా ఉంటానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో మేకల సుప్రియ, పెంచలయ్య, పాశం వేణు, ఎన్.రమణయ్య, తదితరులు పార్టీలో చేరిన వారిలో ఉన్నారు.