హాస్టల్‌లో నాసిరకం భోజనం.. ఎమ్మెల్యే ఆగ్రహం

హాస్టల్‌లో నాసిరకం భోజనం.. ఎమ్మెల్యే ఆగ్రహం

సత్యసాయి: గుండుమల జూనియర్ కళాశాల, కస్తూర్బా హాస్టల్‌ను ఆదివారం రాత్రి ఎమ్మెల్యే ఎంఎస్ రాజు ఆకస్మికంగా పరిశీలించారు. పురుగులు పట్టిన కూరగాయలు, నాసిరకం భోజనం, 200 మంది విద్యార్థులకు కేవలం రెండు మరుగుదొడ్లు మాత్రమే ఉండటం చూసి ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యం వహించిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.