కలెక్టర్ రాజర్షి షాకు ఉద్యోగ సంఘం అభినందనలు
ADB: జిల్లా అభివృద్ధికి కృషి చేస్తూ, వరుస జాతీయ స్థాయి అవార్డులు తీసుకువస్తున్న జిల్లా కలెక్టర్ రాజర్షి షాను పలువురు అభినందిస్తున్నారు. శుక్రవారం తెలంగాణ వైద్య ప్రజా ఆరోగ్య ఉద్యోగ సంఘం H-1 ఆధ్వర్యంలో ఉద్యోగులు కలెక్టర్‌ను కలిసి, పూలబొకే అందించి అభినందనలు తెలిపారు. కలెక్టర్ నేతృత్వంలో జిల్లా అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు.