ఆసుపత్రిలో ప్రైవేట్ నియమాలు.. రోగుల ఆవేదన

ఆసుపత్రిలో ప్రైవేట్ నియమాలు.. రోగుల ఆవేదన

సూర్యాపేట జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రి తీరుపై రోగులు, బంధువులు భగ్గుమంటున్నారు. ఆర్‌ఎంవో, సూపరింటెండెంట్‌లను కలవడానికి ముందుగా కింద టేబుల్ వద్ద అనుమతి తీసుకోవాలనే కొత్త నిబంధనపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది ప్రైవేట్ ఆసుపత్రిని తలపిస్తోందని, రాష్ట్రంలో ఎక్కడా లేని ఈ నిబంధనపై కలెక్టర్ తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.