ప్రమాణ స్వీకారానికి హాజరుకాని వార్డ్ మెంబర్లు
RR: షాద్‌నగర్ నియోజకవర్గంలోని గ్రామాల్లో నూతన సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డ్ మెంబర్ల ప్రమాణ స్వీకార మహోత్సవం వైభవంగా జరుగుతోంది. ఈ క్రమంలో రాసుమల్లగూడ గ్రామంలో ముగ్గురు వార్డ్ మెంబర్లు ప్రమాణస్వీకారానికి హాజరుకాలేదు. బ్యానర్‌లో ఎమ్మెల్సీ నవీన్ కుమార్ రెడ్డి ఫోటో లేకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. దీంతో గ్రామంలో వింత పోకడలకు దారితీస్తోందని పలువురు అంటున్నారు.