శ్రీ ఏడుపాయల అమ్మవారికి విదియ పూజలు

MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల పుణ్యక్షేత్రంలో బుధవారం వన దుర్గమ్మకు అర్చకులు విదియ ప్రత్యేక పూజలు నిర్వహించారు. వైశాఖమాసం కృష్ణ పక్షం సౌమ్యవాసి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేసి సుగంధ పుష్పాలతో అలంకరించారు అనంతరం మహా మంగళహారతి చేశారు.