మిషన్ భగీరథ నీళ్లు రాక అవస్థలు

మిషన్ భగీరథ నీళ్లు రాక అవస్థలు

VKB: యాలాల్ మండలం రాస్నంలో గత ఐదు రోజులుగా మిషన్ భగీరథ నీళ్లు రాకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయాన్నే పనులకు వెళ్లాల్సిన వారు, పనులు మానుకుని నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్లాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీటి కష్టాలు తీరేది ఏనాడని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించాలని స్థానికులు కోరారు.