'GVMC మైదానాల్లో యూజర్ చార్జీలను రద్దు చేయాలి'
VSP: జీవీఎంసీ మైదానాల్లో వాకర్స్, క్రీడాకారులపై విధించిన యూజర్ చార్జీలను వెంటనే ఉపసంహరించుకోవాలని CPM మాజీ కార్పొరేటర్ డాక్టర్ బి.గంగారావు డిమాండ్ చేశారు. సోమవారం జీవీఎంసీ PGRSలో ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వేల కోట్ల బడ్జెట్ ఉండి కూడా పౌర సేవలను వ్యాపార సరుకులుగా మార్చడం సరికాదన్నారు.