వస్త్ర ప్రదర్శనను ప్రారంభించిన మంత్రి లోకేష్
NTR: విజయవాడలో క్రాఫ్ట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు చేసిన ‘వసంతం-2025’ చేనేత వస్త్ర ప్రదర్శనను మంత్రి లోకేష్ ప్రారంభించారు. ఈ ఎగ్జిబిషన్‌లో వివిధ రాష్ట్రాలకు చెందిన చేనేత కార్మికులు తయారుచేసిన ఉత్పత్తి స్టాల్స్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా సహజసిద్ధ రంగులతో తయారు చేసిన ‘కొత్తూరు వసంత వర్ణ’ నూతన చేనేత బ్రాండ్‌ను మంత్రి ఆవిష్కరించారు.