VIDEO: శిధిలావస్థకు చేరిన కమ్యూనిటీ హాల్

VIDEO: శిధిలావస్థకు చేరిన కమ్యూనిటీ హాల్

కృష్ణా: కపీలేశ్వరపురంలో కమ్యూనిటీ హాల్ పూర్తిగా శిధిలావస్థకు చేరి,అసౌకర్యాన్ని ఉందని స్థానికులు ఆదివారం తెలిపారు. ఎన్నో ఏళ్లుగా గ్రామస్తులు కార్యక్రమాలకు ఉపయోగించుకునే ఈ కమ్యూనిటీ హాల్ గోడలు పాడైపోవడం, పైకప్పు వర్షాల్లో కారడం, నేల భాగం కూడా దెబ్బతినడంతో ప్రజలు భద్రతా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. నూతన కమ్యూనిటీ హాల్ నిర్మించాలని వారు కోరుతున్నారు.