'నాయక్ పోడ్ సంఘ అభివృద్ధికి కృషి'

ADB: నాయక్ పోడ్ సంఘ అభివృద్ధి కి కృషి చేస్తానని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు.సోమవారం బోథ్ మండలంలోని కౌట బి గ్రామానికి చెందిన నాయక్ పోడ్ సంఘ సభ్యులు ఎమ్మెల్యేను కలిసి గ్రామంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణం కొరకు వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారని సంఘం సభ్యులు చెప్పారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ జాధవ్‌ను శాలువతో సన్మానించారు.