చెత్త వేస్తే రూ. 10 వేల జరిమానా: సర్పంచ్

చెత్త వేస్తే రూ. 10 వేల జరిమానా: సర్పంచ్

WGL: పర్వతగిరి మండల కేంద్రంలో ఎక్కడపడితే అక్కడ వ్యర్థాలు పడేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సర్పంచ్ చీదురు శంకర్ హెచ్చరించారు. శనివారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పోలుకమ్మ చెరువు పరిసరాల్లో చెత్త వేస్తే రూ. 10,000 జరిమానా విధిస్తామని, సమాచారం ఇచ్చిన వారికి రూ. 1,000 బహుమతి ఇస్తామని తెలిపారు. గ్రామ పరిశుభ్రతకు ప్రతి కుటుంబం సహకరించాలని కోరారు.