రహదారి నిర్మాణ పనులు ప్రారంభం
కృష్ణా: ఘంటసాల మండల పరిధిలోని ఘంటసాల నుంచి జోడుగూడెం వెళ్ళే రహదారి కుంగిపోయి ప్రయాణానికి తీవ్ర ఇబ్బందికరంగా మారింది. R&B శాఖ నుంచి రూ. 5 లక్షల నిధులు మంజూరు కావడంతో సోమవారం పనులు ప్రారంభించారు. రహదారి మరల కృంగిపోకుండా ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. పటిష్టంగా రహదారి నిర్మాణ పనులు చేపట్టాలని వాహనదారులు, ప్రజలు కోరుతున్నారు.