'అగ్ని ప్రమాదాల పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి'

'అగ్ని ప్రమాదాల పై నిరంతరం అప్రమత్తంగా ఉండాలి'

ఆదిలాబాద్: అగ్ని ప్రమాదాలపై అగ్నిమాపక శాఖ అధికారులు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని రామగుండం సీపీ శ్రీనివాసులు సూచించారు. గురువారం మంచిర్యాల జోన్ పరిధిలోని అగ్నిమాపక శాఖ అధికారులు పోలీసులతో సమావేశం నిర్వహించారు. రద్దీ ప్రాంతాల్లో ఉండే కమర్షియల్ కాంప్లెక్స్ లు, గోదాముల్లో ఫైర్ సేఫ్టీ ఉండేలా చర్యలు తీసుకోవాలని, నిరంతరం తనిఖీలు చేపట్టాలని అన్నారు.