VIDEO: జగన్ పాదయాత్రకు 8 ఏళ్ల వేడుకలు
E.G: వైసీపీ అధినేత వైఎస్ జగన్ పాదయాత్రకు 8 ఏళ్లు పూర్తయిన సందర్భంగా రాజమండ్రి సిటీ కార్యాలయంలో వేడుకలు ఇవాళ ఘనంగా జరిగాయి. మాజీ ఎంపీ మార్గాని భరత్ కేక్ కట్ చేసి, 2019 విజయానికి పాదయాత్రే మూలం అని తెలిపారు. ప్రజలకు ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అందించడంలో జగన్ పాత్రను ఆయన ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో మార్గాని నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.